Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

రబీ మిల్లింగ్‌ నిబంధనలు సడలించాలి.. కలెక్టరేట్‌ ఎదుట రైస్‌ మిల్లర్స్‌ నిరసన..! 

రబీ 2025–26 సీజన్‌ మిల్లింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్‌ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

రబీ మిల్లింగ్‌ నిబంధనలు సడలించాలి.. కలెక్టరేట్‌ ఎదుట రైస్‌ మిల్లర్స్‌ నిరసన..! 

కరీంనగర్‌ బ్యూరో, మనసాక్షి :

రబీ 2025–26 సీజన్‌ మిల్లింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్‌ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ సంఘం నిర్ణయం మేరకు చేపట్టిన ఈ నిరసనలో మిల్లర్లు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్బంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్ రావు మాట్లాడుతూ.. రబీ మిల్లింగ్‌కు ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా మిల్లింగ్‌ ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలు, అవుట్‌టర్న్‌ రేషియో, భౌతిక తనిఖీలు తదితర అంశాలపై మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రబీ ధాన్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

మిల్లర్లపై అదనపు భారం పడకుండా నిబంధనలను సడలించాలని, మిల్లింగ్‌కు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మిల్లింగ్‌ అనంతరం బియ్యం డెలివరీ, గోదాముల్లో నిల్వ స్థలం తదితర అంశాల్లోనూ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ALSO READGold Price : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలతో మిల్లింగ్‌ నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాలని, మిల్లర్లకు అనుకూలంగా మార్గదర్శకాలను సడలించాలని కోరారు. ధాన్యం సేకరణ నుంచి బియ్యం సరఫరా వరకు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బోనగిరి శశి కిరణ్, గిరిదర్ లాల్ మరియు రైస్ మిల్ నిర్వాహకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు