వన్ రైడ్ 2026: మంచు చిరుత సంరక్షణ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ ‘వన్ రైడ్’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోటార్‌సైకిల్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ వార్షిక ప్రపంచ వేడుక ‘వన్ రైడ్’ సెప్టెంబరు 20, 2026న జరగనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోటార్‌సైకిల్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ వార్షిక ప్రపంచ వేడుక ‘వన్ రైడ్’ సెప్టెంబరు 20, 2026న జరగనుంది. ఈ మహా ప్రయాణంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి.
2011 నుండి ప్రారంభమైన ఈ వేడుక, రాయల్ ఎన్ఫీల్డ్ 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఏకంగా 60 దేశాలలో 1,600 కన్నా ఎక్కువ రైడ్లుగా విస్తరించింది. “ప్రతి రైడర్. ప్రతి రహదారి. ఒకే లక్ష్యం.” అనే నినాదంతో ఈసారటి రైడ్‌ను ఎత్తైన పర్వతాల ప్రాంతపు ప్రత్యేక జీవి అయిన మంచు చిరుత సంరక్షణకు అంకితం చేశారు. వన్ రైడ్ 2026లో పాల్గొనే ప్రతి రైడర్ తరఫున రాయల్ ఎన్ఫీల్డ్ మంచు చిరుత సంరక్షణ నిధికి విరాళం అందిస్తుంది.
హిమాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్లలో ఇప్పటికే విస్తరించి ఉన్న ఈ సోషల్ మిషన్, వేలాది చదరపు కిలోమీటర్ల మంచు చిరుత ఆవాసాలను పరిరక్షిస్తోంది. ఢిల్లీ నుంచి లండన్ వరకు ఏ ప్రాంతంలో రైడ్ చేసినా, ప్రతి రైడర్ కూడా హిమాలయాల పరిరక్షణ ప్రయత్నాలకు ప్రత్యక్షంగా సహకరించినవారవుతారు. సెప్టెంబరు 20వ తేదీ సమీపిస్తున్నందున, ఆసక్తి గల రైడర్లు తమ సమీపంలోని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ ద్వారా లేదా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకుని ఈ చారిత్రక ప్రయాణంలో భాగస్వాములు కావచ్చు.









