ఘనంగా విశ్వకర్మ జయంతి.. వేడుకల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి.
జిల్లా కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి.. వేడుకల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి.
నారాయణపేటటౌన్, మనసాక్షి:-
జిల్లా కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రాచీన కాలం నుంచి తమ నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకతతో వివిధ రంగాల అభివృద్ధికి విశ్వకర్మలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు.
విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సామాజిక వర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్వకర్మలను దైవస్వరూపంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. కళలు, వృత్తులు, నిర్మాణ రంగాల్లో విశ్వకర్మలు అందించిన సేవలు, వారి నైపుణ్యం, కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ALSO READ : రైస్ మిల్లులో విజిలెన్స్ సోదాలు.. 6 వేల 26 బస్తాలు మాయం..!
ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వరి, పుర చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీ పీ ఆర్ వో రషీద్, విశ్వకర్మ సంఘ ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, విశ్వకర్మ సామాజిక వర్గ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.









