కిష్టాపురం 2వ కాలువ గండి.. వృధాగా నీరు..!
అనంతగిరి మండలం కిష్టాపురం 2వ కాలువకు గండి పడి నాలుగు రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కిష్టాపురం 2వ కాలువ గండి.. వృధాగా నీరు..!
అనంతగిరి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కిష్టాపురం 2వ కాలువకు గండి పడి నాలుగు రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాలువకు గండి పడటంతో నీరు వృథాగా ప్రవహిస్తూ, సాగునీటిపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు అవసరమైన సాగునీరు సక్రమంగా అందక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
రైతుల సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి కిష్టాపురం 2వ కాలువకు పడిన గండిని వెంటనే పూడ్చి, నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే నాలుగు రోజులుగా సమాచారం ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
చేస్తున్నాము.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇకనైనా స్పందించి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతున్నామని భారతీయ జనతా పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చింతకుంట్ల సతీష్ కోరారు.
MOST READ :









