ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి..!
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం శ్రీకాకుళం టెక్కలి బర్మా కాలనీ సమీపంలో రైలు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం శ్రీకాకుళం టెక్కలి బర్మా కాలనీ సమీపంలో రైలు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బర్మా కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులను రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా హాస్టల్ విద్యార్థులు.
ALSO READ : Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో గణేష్ విగ్రహాలు మునగక భక్తుల ఆగ్రహం.. స్పందించిన ప్రభుత్వం..!
నౌపడ నుంచి బయలుదేరి టెక్కలి వైపు రైల్వే ట్రాక్ పక్కన చేపలు పట్టేందుకు నడిచి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. టెక్కలి ఆర్డిఓ కృష్ణమూర్తి, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. నిమ్స్ అడిషనల్ సూపరిండెంట్ కు రిమాండ్..!
ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన ద్వారా రైల్వే రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది.









