Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కీలక ప్రకటన.. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

ప్రస్తుత సమాజంలో వివిధ రూపాల్లో జరుగుతున్న చీటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కీలక ప్రకటన.. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

(నారాయణపేట టౌన్ – రమాకాంత్, మనసాక్షి )

ప్రస్తుత సమాజంలో వివిధ రూపాల్లో జరుగుతున్న చీటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బంగారం, స్థలాలు, ఆన్‌లైన్ వ్యాపారాలు, లక్కీ డ్రాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, సులభంగా లోన్, తక్షణ ఉద్యోగం, లాటరీ గెలుపు వంటి ఆశాజనక మాటలతో ప్రజలను నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మి ఎవరూ మోసపోవద్దని హెచ్చరించారు.

ఇటీవల కొందరు ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి స్థలాలు, ఇళ్లు అమ్ముతున్నట్లు నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలు సమయంలో సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించి, అధికారిక ధృవీకరణ తీసుకున్న తర్వాతే లావాదేవీలు చేయాలని సూచించారు.

Also Read : District Collector : సైబర్ల్ నేరాలపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కీలక సూచన.. సైబర్ ముఠా అరెస్ట్..!

అలాగే సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని డబ్బులు అడగడం, ఫేక్ అకౌంట్లతో మోసాలు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచుకోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.

విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలను మాత్రమే సంప్రదించాలని అన్నారు. మహిళలు బంగారం, చిట్‌ఫండ్లు, ఆన్‌లైన్ షాపింగ్ వంటి విషయాల్లో ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.

Also Read : Breaking : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య, రామంతపూర్ లో భారీ ప్రమాదం.. ఓకే క్లిక్ తో ఎన్నో బ్రేకింగ్ న్యూస్ 25/10/2026

ప్రజలు ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. చీటింగ్ కేసులపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని, మోసగాళ్లను చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించాలి అని కోరారు.

మరిన్ని వార్తలు