Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ

Breaking News : కొండచిలువ కడుపులో గొర్రె పిల్ల.. రెండేళ్ల చిన్నారిని హత్య చేసిన దంపతులు.. ఒకే క్లిక్ తో ఎన్నో బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి పత్రిక ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. ఈరోజు బుధవారం బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

Breaking News : కొండచిలువ కడుపులో గొర్రె పిల్ల.. రెండేళ్ల చిన్నారిని హత్య చేసిన దంపతులు.. ఒకే క్లిక్ తో ఎన్నో బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి పత్రిక ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. ఈరోజు బుధవారం బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రాక్‌ పక్కనే వ్యక్తి :

ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రాక్‌ పక్కనే వ్యక్తి.. రైలు ఢీకొనడంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. హైదరాబాద్‌లోని బొల్లారం సమీపంలో చోటు చేసుకున్న దుర్ఘటన జరిగింది. ఓ వ్యక్తి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. రైల్వే ట్రాక్ పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాడు.
అదే టైంలో అటుగా వచ్చిన రైలు.. వ్యక్తిని గమనించి పదే పదే హారన్ కొట్టిన లోకో పైలట్. కానీ ఇయర్ ఫోన్స్ కారణంగా వినిపించకపోవడంతో.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి. రైలు ఢీకొట్టిన ధాటికి కొంత దూరం ఎగిరిపడి.. తీవ్ర గాయాలతో మృతి చెందిన వ్యక్తి. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

కొండచిలువ కడుపులో గొర్రెపిల్ల :

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట శివారులో కొండచిలువ కడుపులో గొర్రెపిల్ల ఉండి అరుపులు.. బయటకు తీసిన కాపరి. గొర్రెపిల్లను మింగిన కొండచిలువ. కొండచిలువ కడుపులో నుంచి గొర్రెపిల్ల అరుపులు వినిపించడంతో అప్రమత్తమైన గొర్రెల కాపరి. కొండచిలువను కొట్టడంతో బయటపడ్డ గొర్రెపిల్ల. ప్రాణాలతో బయటపడిన గొర్రెపిల్ల.. మృతి చెందిన కొండచిలువ.

రెండేళ్ల పాపను హతమార్చి, తామూ ఆత్మహత్య చేసుకున్న దంపతులు :

హైదరాబాద్– కేపీహెచ్‌బీ ఫేజ్ 3లో నివాసముంటూ తమ రెండేళ్ల పాప స్నిగ్ధను హతమార్చి, తామూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బెంగాల్‌కు చెందిన దంపతులు గోపి, సమత. తమ చావుకు ఎవరూ కారణం కాదని, తమ గురించి ఎవరినీ వివరాలు అడగొద్దని గోడ మీద రాసి దంపతుల ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

తుఫాను ప్రభావం :

తుఫాను ప్రభావంతో యానాం ప్రవేశ మార్గం వద్ద జాతీయ రహదారి 216పై చెట్లు నేలకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు చెట్లను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు