Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

షర్మిల సంచలన స్వీట్.. యలహంక ప్యాలెస్, కుమార్తె వివాహం పై ఎమన్నారంటే..!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇటీవల ఆమె కుమార్తె వివాహం విషయంపై వార్తల్లోకి ఎక్కారు. యలహంక ప్యాలెస్ లో వివాహం చేస్తున్నట్లుగా కుమార్తె అంజలి పెళ్లి పత్రికలో పేర్కొన్న విషయం తెలిసిందే.

షర్మిల సంచలన స్వీట్.. యలహంక ప్యాలెస్, కుమార్తె వివాహం పై ఎమన్నారంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇటీవల ఆమె కుమార్తె వివాహం విషయంపై వార్తల్లోకి ఎక్కారు. యలహంక ప్యాలెస్ లో వివాహం చేస్తున్నట్లుగా కుమార్తె అంజలి పెళ్లి పత్రికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు వైయస్ జగన్ లేఖలు రాయడం.. ఆమె లేఖలు పట్టించుకోకుండా ఉండడం చూసాము. కానీ షర్మిల ట్విట్టర్లో సంచలన ట్వీట్ చేశారు. అదేంటో తెలుసుకుందాం..

Also Read : కూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం..!

నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.

జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.

నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.

వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.

అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.

కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.

మరిన్ని వార్తలు