Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

శాతవాహన యూనివర్సిటీలో లా విద్యార్థిని ఆత్మహత్య..!

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని డక్కాలి చంద్రకళ (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

శాతవాహన యూనివర్సిటీలో లా విద్యార్థిని ఆత్మహత్య..!

కరీంనగర్‌ బ్యూరో – నరేష్, మన సాక్షి : 

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని డక్కాలి చంద్రకళ (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఆమె హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని మృతిచెందారు.

మధ్యాహ్నం భోజనానికి వెళ్లేందుకు తోటి విద్యార్థినులు పిలిచినా గది తలుపులు తీయకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు తలుపులు పగలగొట్టి చూడగా చంద్రకళ ఉరివేసుకుని కనిపించారు. ఆమె మెడలో బ్లూటూత్‌ ఉండటంతో పాటు ఫోన్‌లో మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది.

Also Read : జోగిని దారుణ హత్య, భారీ దోపిడీ, కారుతో సహా పరారైన దుండగులు..!

సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలనుంది.

మరిన్ని వార్తలు