Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
కండక్టర్ ప్రవల్లిక కుటుంబానికి అండగా..!
ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించడం జరిగింది.

కండక్టర్ ప్రవల్లిక కుటుంబానికి అండగా..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించడం జరిగింది. ప్రవళిక తల్లిని పరామర్శించి వారికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ,ప్రభుత్వం, ఆర్టీసీ నుండి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి కోటి రూపాయలు ప్రమాదా భీమా అందనుంది.










