Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుపండుగలురంగారెడ్డి

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు..!

నూతన వస్త్రాలు అందజేసి, టపాకాయలు కాలుస్తూ సందడి.అర్హులందరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత మాదేనని అభిషేక్‌రెడ్డి హామీ.ఇళ్లలో వెలిగిన దీపాల కాంతులు, కుటుంబ సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు సొంతింటి రూపంలో ఫలితం దక్కడంతో నిండిన ఆనందం.

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు..!

( ఇబ్రహీంపట్నం – శేఖర్ )

నూతన వస్త్రాలు అందజేసి, టపాకాయలు కాలుస్తూ సందడి.అర్హులందరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత మాదేనని అభిషేక్‌రెడ్డి హామీ.ఇళ్లలో వెలిగిన దీపాల కాంతులు, కుటుంబ సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు సొంతింటి రూపంలో ఫలితం దక్కడంతో నిండిన ఆనందం. ఇలా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగ వేళ పండుగ శోభ వెల్లివిరిసింది. పేదల సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన’మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం లబ్ధిదారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దీపావళి పర్వదినాన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి మంచాల మండలం లింగంపల్లి, ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి, లబ్ధిదారుల కుటుంబాలను కలుసుకున్నారు.

Also Read : ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్..! 

తమ ఇంటికి వచ్చిన అభిషేక్‌రెడ్డికి లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అభిషేక్‌రెడ్డి.వారికి నూతన వస్త్రాలు అందజేసి,స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి టపాకాయలు కాలుస్తూ దీపావళి సంబరాల్లో పాలుపంచుకున్నారు.

చిన్నారులతో కలిసి బాణసంచా కాలుస్తూ,వారితో సరదాగా ముచ్చటిస్తూ సందడి చేశారు. పండుగ వేళ తమ ఇంటికి వచ్చి, తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి సంబరాలు జరుపుకోవడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.దశాబ్దాల కల ప్రజాపాలనలో సాకారం

ఆర్థిక ఇబ్బందుల కారణంగా సొంత ఇల్లు నిర్మించుకోలేక దశాబ్దాలుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని,చివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తమ జీవితకాల స్వప్నం నెరవేరిందని పలువురు లబ్ధిదారులు భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక చొరవ,కృషితోనే తమకు సొంతింటి భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

తమ జీవితాల్లో ఈ దీపావళి నిజమైన వెలుగులు నింపిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు సంజీవరెడ్డి, శివ, పంచాయతీ కార్యదర్శలు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, లింగం, మంఖాల దాసు, శ్రీశైలం, మార్కెట్ కమిటీ వైస్‌ఛైర్మన్ కరుణాకర్, ఎన్‌ఎస్‌యుఐ ప్రెసిడెంట్ అయాన్ పటేల్, రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు