బియ్యం ధరలపై ప్రభుత్వం సీరియస్.. గరిష్ట పరిమితి విధిస్తూ నిర్ణయం, ఇవీ ఫైనల్ ధరలు..!
తెలంగాణలో పెరుగుతున్న బియ్యం ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

బియ్యం ధరలపై ప్రభుత్వం సీరియస్.. గరిష్ట పరిమితి విధిస్తూ నిర్ణయం, ఇవీ ఫైనల్ ధరలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణలో పెరుగుతున్న బియ్యం ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు గాను పౌరసరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులు కనీసం బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అన్నపూర్ణగా పేరు ఉన్న తెలంగాణలో బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది.
బియ్యం నిల్వలు ఉన్నాయని కృత్రిమ కొరతను సృష్టించే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్న వ్యాపారులను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ MRP గరిష్ట విక్రయ ధరలను నిర్ణయిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా BPT, NMR రకాలకు కిలో గరిష్ట ధర 66 రూపాయలు, RNR, తెలంగాణ సోనా రకాలు గరిష్ట ధర 74 రూపాయలు, HMT, JSR రకాలు కిలో గరిష్ట ధర 79 రూపాయలుగా నిర్ణయించింది.
Also Read : తాసిల్దార్ కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం.. పాత రికార్డులు దగ్ధం..?
అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఈ గరిష్ట ధరల కంటే ఎక్కువ మొత్తానికి బియ్యం విక్రయిస్తే సహించేది లేదని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చీఫ్ రేషన్ ఆఫీసర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్ తీవ్రంగా హెచ్చరించారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :
ప్రభుత్వ ఆదేశాలను బేకాతరు చేస్తూ ఎవరైనా గరిష్ట పరిమితికి మించి అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే ఎలాంటి వ్యాపారులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారులు నియమ నిబంధనలకు కట్టుబడి విక్రయాలు జరపాలని సూచించారు.
మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు బియ్యం విక్రయించినట్లుగా గమనిస్తే వెంటనే సమాచారాన్ని పౌరసరఫరాల శాఖకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు. నిత్యవసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ అక్రమ నిలువలపై నిరంతరం నిఘా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.









