Miryalaguda : సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..!
మిర్యాలగూడ లోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

Miryalaguda : సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ లోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ అలుగు బెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగు బెల్లి శిరీష విద్యార్థులను ఉద్దేశించి చక్కటి సందేశాత్మక ప్రసంగాలు చేశారు. బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్యార్థులకు మంచి భవిష్యత్తు కోసం విలువైన సూచనలు అందించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు :
విద్యార్థులు రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్లు, ఉపాధ్యాయులు , ఆర్మీ జవాన్, పోలీసుల లాగా మరియు ఇంకా అనేక రకాల పాత్రలను అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే విద్యార్థులు ప్రసంగాలు, నృత్యాలు మరియు నాటికలతో అందరినీ అలరించారు. ఉపాధ్యాయుల సహకారం, విద్యార్థుల ప్రతిభతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.










