Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

బతికుండగానే భార్యా డెత్ సర్టిఫికెట్ సృష్టించిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్..!

భార్యతో విభేదాలు వచ్చి ఆమె దూరంగా ఉంటుందన్న కోపంతో పాటు, ఆమె పేరిట ఉన్న స్థలాన్ని కాజేయాలన్న దుర్బుద్ధితో ఓ భర్త అసాధారణ మోసానికి పాల్పడ్డాడు.

బతికుండగానే భార్యా డెత్ సర్టిఫికెట్ సృష్టించిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్..!

( ఆర్మూర్ – నరేష్ )

భార్యతో విభేదాలు వచ్చి ఆమె దూరంగా ఉంటుందన్న కోపంతో పాటు, ఆమె పేరిట ఉన్న స్థలాన్ని కాజేయాలన్న దుర్బుద్ధితో ఓ భర్త అసాధారణ మోసానికి పాల్పడ్డాడు. బతికు ఉన్న భార్యనే చనిపోయినట్లు నమ్మించి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ప్లాట్‌ను అమ్మేసిన నిందితుడిని ఆర్మూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆర్మూర్ పెర్కిట్ ప్రాంతానికి చెందిన దేశాయిపేట రవికి 2017లో గీతాంజలితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (మోక్షిత్) కలడు. కొన్నాళ్ల పాటు కాపురం చేసిన తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో గీతాంజలి తన కుమారుడితో కలిసి వేరుగా తల్లిగారింట్లో ఉంటున్నది. అయితే ఆర్మూర్ నగరంలోని కోటర్మూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 212/అ, 212/ఆ, లేఅవుట్ ప్లాట్ నెంబర్ 4 లో సుమారు 267 గజాల స్థలం గీతాంజలి పేరిట ఉంది. ఈ ఆస్తిని ఎలాగైనా విక్రయించి సొమ్ము చేసుకోవాలని రవి ప్లాన్ చేశాడు. డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న తన అనుభవంతో, రవి తన కార్యాలయ కంప్యూటర్‌లోనే భార్య గీతాంజలి మృతి చెందినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించాడు.

Also Read : హైదరాబాద్ పర్యటనలో రాహుల్ గాంధీ.. వీటికి సమాధానం ఏది..? అంటూ కేటీఆర్ సూటి ప్రశ్నలు..!

అంతేకాకుండా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో ఆమె మరణించినట్లు తప్పుడు మరణ వాంగ్మూల ధ్రువీకరణ పత్రాలు సృష్టించి,వాటి ఆధారంగా అప్పటి ఎమ్మార్వో కార్యాలయం నుండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందాడు. ఈ నకిలీ పత్రాలను అడ్డం పెట్టుకుని, తన భార్య పేరు మీద ఉన్న ఆ ప్లాటును 2025లో ఆర్మూర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తన తల్లి లక్ష్మీబాయి పేరిట ‘గిఫ్ట్ డీడ్’ రూపంలో బదిలీ చేయించుకున్నాడు.

ఆ తర్వాత ఆ స్థలాన్ని మరొక వ్యక్తికి రూ. 15 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వానికి చెందిన ‘సీఎం రిలీఫ్ ఫండ్’ పొందేందుకు సైతం ఈ నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని వాడుకోవడానికి ప్రయత్నించాడు. బాధిత భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఆర్మూర్ పోలీసులు, ఈ మోసానికి పాల్పడిన నిందితుడు దేశాయిపేట రవిని శనివారం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు