Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండ

అర్హులైన ప్రతి నిరుపేద పేద కుటుంబానికి చేయూత పింఛన్లు..!

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబాలకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ, కల్లుగీత పెన్షన్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యం మనీ మల్లాడి పల్లి గ్రామ సర్పంచ్ నల్ల సుమితా రఘుమారెడ్డి పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి నిరుపేద పేద కుటుంబానికి చేయూత పింఛన్లు..!

(చింతపల్లి, మన సాక్షి – వెంకట్)

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబాలకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ, కల్లుగీత పెన్షన్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యం మనీ మల్లాడి పల్లి గ్రామ సర్పంచ్ నల్ల సుమితా రఘుమారెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలో సాయి సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతపల్లి మండలంలో 2000 పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందజేసినట్లు వారు పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతూ దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. సందర్భంగా మల్లారెడ్డిపల్లి గ్రామ లోని అర్హులైన వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో సుజాత, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జటావత్ వారి నాయక్, అంగిరేకుల నాగభూషణం, జిల్లా నాయకులు ఎరుకల వెంకటయ్య గౌడ్, ముచ్చర్ల యాదగిరి, దాసరి శ్రీనివాస్ యాదవ్, తీదేడు మాజీ సర్పంచ్ కాయితి, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచాయతీ కార్యదర్శులు, పలు గ్రామాల సర్పంచులు, మండల ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

చింతపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి గార్డెన్స్‌లో మంగళవారం పెన్షన్ మంజూరు కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ , పాల్గొని అరుహులైన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అదేవిధంగా తీదేడు గ్రామంలోని సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి చేతుల మీదుగా నూతనంగా మంజూరైన పెన్షన్ల లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, పేద ప్రజలకు పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు