Paddy : వరికి బోనస్ క్వింటాకు రూ. 500 ఇవ్వాలి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలి..!

వరికి బోనస్ క్వింటాలుకు రూ, 500 ఇవ్వాలని, ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని పలు డిమాండ్ లు చేస్తూ నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పక్షాన కలెక్టర్ కు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు .

Paddy : వరికి బోనస్ క్వింటాకు రూ. 500 ఇవ్వాలి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలి..!

నల్లగొండ, మనసాక్షి

వరికి బోనస్ క్వింటాలుకు రూ, 500 ఇవ్వాలని, ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని పలు డిమాండ్ లు చేస్తూ నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పక్షాన కలెక్టర్ కు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు . కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వరికి క్వింటాలుకు వెంటనే 500 రూపాయలు బోనస్ ప్రకటించాలి అని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టం కు. కారణమన్నారు కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదు అని విమర్శించారు. కేసీఆర్ పొలం బాట పట్టకే సర్కారు పంటల విషయంలో కళ్ళు తెరిచిందనీ పేర్కొన్నారు.
బి అర్ ఎస్ పోరాటాల వల్ల రైతులకు కొంత ఊరట. వడగళ్ళు, ఎండిన పంటలకు ఎకరాకు 25 వెల నష్ట పరిహారం ఇవ్వాలి.
వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలి. ఎలక్షన్ కోడ్ ఉందని ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారు.

ALSO READ : Irregularities in PACS : సూర్యాపేట జిల్లా చిల్లేపల్లి సహకార సంఘంలో రూ.2 కోట్ల అక్రమాలు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసన..!

రైతులను దగా చేసింది కాంగ్రెసే వంద రోజుల తరువాతే కోడ్ వచ్చింది. పంటలకు ఇస్తామన్న బోనస్ యసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలి. ఎకరాకు 15 వెలు రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇవ్వాలి. అడుగడుగునా రైతులకు కాంగ్రెస్ అన్యాయం. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలి. బి అర్ ఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా మదెప్పుడు రైతు పక్షమేరైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నరు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చింది. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా ఎండలే కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎందుతున్నాయి. నీళ్ళు ఉందగా ఇవ్వకుండా పంటలు ఎండగడుతున్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి. తక్షణమే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మమ్మల్ని విమర్శించే హక్కులేదన్నారు.

ALSO READ : KTR : ముఖ్యమంత్రా.. బోటి కొట్టేవాడా, రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్..!

 

దొడ్డిదారిన అధికారంలో కు వచ్చిన కాంగ్రెస్ హామీల అమలును విస్మరించింది. పంటలు ఎండుతుంటే వికృత అనండం పొందుతున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ వచ్చాక నిళ్లు తగ్గి రైతుల్లో కన్నీళ్లు పెరిగినయి. దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.* రైతుల ఆత్మహత్యలను కూడా జోకులు వేస్తున్నారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ద రైతులకు నీళ్ళు ఇవ్వడంలో లేదు
ఇప్పటికైన ప్రభుత్వం రాజకీయాలు మాని రైతుల్ను ఆడుకోవాలి. రైతులకు మేలు చేస్తే మేము అడ్డుకొం..
మీలాగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయం. మిగిలిన వారికి రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి. జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు మాజీ శాసనసభ్యులు.. పలువురు ప్రజా ప్రతినిధులనుండి విజ్ఞాపన పత్రం స్వీకరించడానికి కలెక్టర్, గాని జాయింట్ కలెక్టర్ గాని అందుబాటులోకి రాకపోవడం పట్లవారు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.

ఇది ప్రజాస్వామ్య దేశమని రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తేవడానికి తాము కలెక్టరేట్ కు వస్తే తమను కలవకపోవడం విచారకరమని. గతంలో కూడా వారు ఇదేవిదంగా విధంగా ప్రవర్తించారని ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజా సేవకులైన అధికారులు ప్రజల తరఫున ఎవరు వచ్చిన వారిని సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. జిల్లా ఉన్నతాధికారులు అందుబాటులో ఉండి తమను కలకపోవడంతో డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు.

ALSO READ : KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!

ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. రమావత్ రవీంద్ర కుమార్ , శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి , బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ,రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు రామచంద్రు నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా.. సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ఆలకుంట్ల నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్ లు.. నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, నారబోయిన బిక్షం, బకరం వెంకన్న, తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి,పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, నల్గొండ తిప్పర్తి కనగల్ పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి పల్ రెడ్డి రవీందర్ రెడ్డి అయితగోని యాదవ్.. పట్టణ పార్టీ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావుమాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి,మెరుగు గోపి.. నల్గొండ మండల పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్..జి జంగయ్య నాగరాజు విద్యార్థి నాయకుడు నాగార్జు న తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!