Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

NALGONDA : నల్గొండ జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక కమిటీ.. ఆ కమిటీ ఏం చేస్తుందంటే..! 

NALGONDA : నల్గొండ జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక కమిటీ.. ఆ కమిటీ ఏం చేస్తుందంటే..! 

నల్లగొండ, మన సాక్షి ;

నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాలు ఏ రూపంలో ఉన్న నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

తన చాంబర్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కో- ఆర్డినేషన్ సెంటర్ కమిటీ (ఎన్ కార్డ్ ) (మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ) సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ , పోలీసు తో పాటు, ఇతర సంబంధిత శాఖలన్నీ సంపూర్ణ సహకారం అందించినప్పుడే పూర్తిస్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించే అవకాశం ఉందని అన్నారు.

జిల్లాలో గంజాయి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ముందుగా గంజాయి పై ప్రత్యేక దృష్టి నిలపాలన్నారు. గంజాయి ఒక సామాజిక దురాచారం లా తయారైందని, దీనిని పూర్తిస్థాయిలో తుడిచిపెడితేనే సమాజం బాగుపడుతుందని, ఇందుకు కావాల్సిన అన్ని చర్యలను ప్రతి శాఖ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల్లో గంజాయి వంటి మత్తు పదార్థాల పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇందులో భాగంగా వచ్చేవారం ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో” గంజాయి వ్యతిరేక వారోత్సవం” నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. “గంజాయి వ్యతిరేక వారోత్సవం” భాగంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగులు, ఏర్పాటు చేయాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, సినిమా థియేటర్లు, స్థానిక కేబుల్ చానల్లలో గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు వివరించాలని అన్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాలు, ప్రత్యేకించి గంజాయి వినియోగం ,రవాణా ఎక్కువగా ఉందని, జాతీయ రహదారి నిడివి సుమారు 70 కిలోమీటర్లు ఉండడం, గంజాయి రవాణాకు అనుకూలంగా ఉన్నందున గంజాయి రవాణా జరుగుతున్నదని తెలిపారు.

అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ, దేవరకొండ ఆర్ డి ఓ లు రవి, శ్రీరాములు, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డిఈఓ బిక్షపతి, డిఐఈఓ దశ్రు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హుస్సేన్ బాబు, అటవీ, పోలీస్, రెవెన్యూ అధికారులు, మండలాల తహసిల్దారులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి ; 

District Sp : నారాయణపేట జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు.. ప్రకటించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ లో బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

మరిన్ని వార్తలు