Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

గిరిజన బిడ్డకు జెన్కోలో ఉద్యోగం..!

గిరిజన బిడ్డకు జెన్కోలో ఉద్యోగం..!

మన సాక్షి, కొండమల్లేపల్లి :

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొలుముంతల పహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో గల మంత్ర్య తండ గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ రమావత్ వస్త్రం- శారదల కుమార్తె రమావత్ మనీషా ఏఈ ఉద్యోగం సాధించారు.

మండల పరిధిలోని మారుమూల గిరిజన తండాకు చెందిన మనీషా చదువుపై మక్కువతో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివి సోమవారం శ్రీశైలంలో బాధ్యతలు స్వీకరించారు. వస్త్రం తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ తమ ముగ్గురు పిల్లలు చదివించారు.

మనిషా ప్రాథమిక విద్యను 5వ తరగతి వరకు కొలుముంతలపాడు లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ,ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు కొండమల్లేపల్లి లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు .ఇంటర్ హైదరాబాద్లోని వికాస్ కళాశాలలో పూర్తిచేసి, బీటెక్ ఖాదర్ మెమోరియల్ కాలేజీలో పూర్తి చేశారు.

పెద్ద కుమారుడు సురేష్ కేరళలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న వయసులో గిరిజన బిడ్డ ఏఈ ఉద్యోగం సంపాదించడం పై బంధుమిత్రులు, నాయకులు అభినందనలు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు