మిర్యాలగూడ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 

మిర్యాలగూడ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ , మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్ కు చెందిన నన్నే పంగు మహేష్ ( 22) ఆలగడప వద్ద భారత్ పెట్రోల్ బంకు సమీపంలో కోదాడ- జడ్చర్ల హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు.

ఇతని స్వగ్రామం నరసయ్య గూడెం గ్రామం నేరేడుచర్ల మండలం ఇతను ఇతని తండ్రి మరణించినప్పటి నుండి తన తల్లితో కలిసి గత 20 సంవత్సరాలుగా మిర్యాలగూడలోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నాడు.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!

24న రాత్రి 11 గంటల సమయంలో తన తల్లితో గొడవపడి అతని స్వగ్రామమైన నరసయ్య గూడెంకు వెళ్తానని ఇంటి నుండి బయలుదేరి దారి గుండా పోతుండగా ఆలగడప గ్రామ శివారులోని భారత్ పెట్రోల్ బంకు దాటినాక కోదాడ జడ్చర్ల రహదారిపై గల కల్వర్టు వద్ద రాత్రి గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొని వెళ్లిపోయినది.

అటుగా వెళుతున్న రాజేష్ అను అతను అంబులెన్స్ కు కాల్ చేయడం ద్వారా అంబులెన్స్ వారు వచ్చి మహేష్ ను మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తుండగా తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు మృతి చెందినాడు. మృతుడి తల్లి మహబూబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : Google pay Lone : గూగుల్ పే వాడుతున్నారా.. ఈజీగా రూ.8 లక్షల లోన్, అతి తక్కువ ఈఎంఐ..!