Since 27 Years : 27 ఏళ్ల తర్వాత ఆత్మీయ పలకరింపు, అపూర్వ స్పందన..!

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కురవి ఉన్నతపాఠశాలలో 1996-97 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు.

Since 27 Years : 27 ఏళ్ల తర్వాత ఆత్మీయ పలకరింపు, అపూర్వ స్పందన..!

• కుటుంబ సభ్యులతో హాజరైన పూర్వ విద్యార్థులు.

• ఒకరికొకరు పలకరించుకొని ఆత్మీయంగా పలకరింపు.

కురవి , మన సాక్షి :

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కురవి ఉన్నతపాఠశాలలో 1996-97 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు.

27 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. తమను ఉన్నతులుగా తీర్చిదిద్దున ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానం చేసి వారి నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు వారి వారి కుటుంబ సభ్యులతో హాజరై జడ్పీఎస్ఎస్ హై స్కూల్ కొరవి నందు సందడి వాతావరణం నెలకొంది.

అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ జీవితంలో పాఠాలు నేర్పించి ఉన్నతను గా తీర్చిదిద్దున మిమ్ముల చూస్తుంటే గర్వంగా ఉందని మీ పిల్లలను సైతం ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పేదరికం అనుభవిస్తున్న కొందరు పూర్వ విద్యార్థుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఐదుగురు విద్యార్థుల ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున విరాళంగా అందజేశారు.

ALSO READ : 

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

HYDERABAD : సంచలనం కలిగించిన బురఖా దొంగలు..కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!