Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Almatti Dam : కృష్ణానదిలోకి తగ్గిన వరద.. ఆలమట్టి డ్యామ్ లోకి నామమాత్రపు ప్రవాహం..!

మహారాష్ట్ర నుంచి కృష్ణా నదిలోకి వరద ప్రవాహం తగ్గిపోయింది. మహారాష్ట్రలో వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం తగ్గింది. దాంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యామ్ లోకి కేవలం నామమాత్రపు ప్రవాహం మాత్రమే వస్తుంది.

Almatti Dam : కృష్ణానదిలోకి తగ్గిన వరద.. ఆలమట్టి డ్యామ్ లోకి నామమాత్రపు ప్రవాహం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

మహారాష్ట్ర నుంచి కృష్ణా నదిలోకి వరద ప్రవాహం తగ్గిపోయింది. మహారాష్ట్రలో వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం తగ్గింది. దాంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యామ్ లోకి కేవలం నామమాత్రపు ప్రవాహం మాత్రమే వస్తుంది. తుంగభద్ర డ్యామ్ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. తుంగభద్ర డ్యామ్ లోకి కూడా వరద ప్రవాహం తగ్గింది.

అలమట్టి డ్యామ్ గరిష్ట నీటి నిలువ సామర్థ్యం 129.720 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.260 టీఎంసీలు నీరు ఉంది. ఆల్మట్టి డ్యామ్ లోకి కేవలం 1904 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుంది.

ఇదిలా ఉండగా తుంగభద్ర డ్యామ్ లోకి వరద నీరు రావడంతో రైతుల్లో కొంచెం ఆశలు చిగురించాయి. కానీ ఎగువన వర్షాలు ఆగిపోవడంతో వరద ప్రవాహం కూడా తగ్గిపోయింది. గురువారం కేవలం 4500 క్యూసెక్కుల నీరు మాత్రమే తుంగభద్రలోకి ఇన్ ఫ్లో ఉంది. తుంగభద్ర డ్యామ్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.20 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జూరాల, శ్రీశైలం డ్యామ్ లోకి ఇప్పటివరకు చుక్క నీరు కూడా రాలేదు.

శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నిలువ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా గురువారం నాటికి 41.69 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అదేవిధంగా నాగార్జునసాగర్ జలాశ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా ప్రస్తుతం 137.864 టీఎంసీల నేను మాత్రమే ఉంది.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు