BIG Breaking : ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ వస్తుందని భావించిన పార్టీ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు నిరాశ కలిగింది.

BIG Breaking : ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ వస్తుందని భావించిన పార్టీ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు నిరాశ కలిగింది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈ డి, సిబిఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. ఎమ్మెల్సీ కవితకు ఈరోజు బెయిల్ వస్తుందని పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. బెయిల్ నిరాకరించడంతో వారు షాక్ కు గురయ్యారు.

 

లిక్కర్ కుంభకోణం కేసులో కవితదే కీలక పాత్ర అని సిబిఐ కోర్టు ఎదుట వాదనలు వినిపించింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారని , బెయిల్ ఇవ్వద్దని కోరింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ నిరాకరించింది. కాగా మార్చి 15వ తేదీన కవితను ఈ డి అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె బీహార్ లోని తీహాడ్ జైల్లో ఉన్నారు.