Congress Party : ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి గ్యారంటీని ప్రకటించిన షర్మిల..!
Congress Party : ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి గ్యారంటీని ప్రకటించిన షర్మిల..!
- ఇందిరమ్మ అభయం పేరుతో మొదటి గ్యారెంటీ
- ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 వేలు ఇచ్చేలా గ్యారెంటీ
- మహిళా పేరు మీదనే చెక్కు పంపిణీ
APCC చీఫ్ షర్మిలా రెడ్డి
మన సాక్షి, ఆంధ్రప్రదేశ్ బ్యూరో :
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో పిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో మొదటి గ్యారెంటీ హామీని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పునాదులు వేసింది
– మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసింది
– ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక గ్యారెంటీ ఇస్తుంది
– ఇది ఇందిరమ్మ అభయం..ఇంటింటికీ 5 వేలు
– పేద కుటుంబాలు నిర్భయంగా బ్రతుకే పథకం
– పేదరికం నిర్మూలన కోసం ఇందిరమ్మ అభయం
– అసమానతలు తొలగింపు కోసం ఈ నూతన ఆలోచన
– ప్రతి ఇంటికి అండగా నిలబడేది ఇందిరమ్మ అభయం
– ప్రతి ఇంటికి మహిళ పేరుమీదే ఈ 5 వేలు ఇస్తాం
– ఇంటికి దైవం ఇల్లాలు.అందుకే మహిళలకు ఈ గ్యారెంటీ
– మహిళ పేరు మీదనే చెక్కు ఇస్తాం
– కాంగ్రెస్ లో వైఎస్సార్ ఎన్నో అద్భుతమైన అమలు చేశాడు
– మళ్ళీ రాష్ట్ర అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యం
– రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో పది అడుగులు కూడా ముందుకు పడలేదు
బాబు,జగన్ పాలనలో 25 ఏళ్లు వెనక్కి వెళ్ళింది
– ఈ 10 ఏళ్లలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు రాలేదు
– పదేళ్లలో పట్టుమని 10 ఉద్యోగాలు కూడా రాలేదు
– ఇతర రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి లో దూసుకు పోతున్నాయి
– రాష్ట్రం అభివృద్ది వెనక్కు నెట్టిన ఘనత చంద్రబాబు,జగన్ ది
– మొదటి 5 ఏళ్లు బాబు మోసం చేశాడు..తర్వాత జగన్ ఆన్న మరో 5 ఏళ్లు మోసం చేశాడు
– తిరుపతి లో నిలబడి మోడీ 10 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పాడు.
– అదే వేదికగా చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగాడు
– అధికారంలో వచ్చి చంద్రబాబు హోదా విషయాన్ని మరిచి పోయాడు
– ప్రత్యేక హోదా కోసమే బీజేపీ తో పొత్తు అని చెప్పాడు
– ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు అన్నాడు బాబు
– ప్రత్యేక హోదా తో రాష్ట్రాన్ని నవ్యాంధ్ర,స్వర్ణాంధ్ర చేస్తా అన్నాడు
– అధికారం అనుభవించి ఊసరవెళ్లి లా రంగులు మార్చారు
– చంద్రబాబు ఒక ఊసరవెల్లి
– బాబును చూసే ఊసరవెల్లి రంగులు మార్చడం నేర్చుకుంది
– హోదా అవసరం ఆన్న నోటితో ..ప్రత్యేక హోదా ఏమైనా సంజీవని నా అన్నాడు
– హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నాడు
– హోదా మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టీ జైల్లో పెట్టాడు
– ఆనాడు జగన్ ఆన్న ప్రతిపక్షంలో ఉండి ఎన్నో దీక్షలు చేశాడు
– నాకు 25 మంది ఎంపిలు ఇస్తే ఎందుకు హోదా రాదో చూద్దాం అన్నాడు
– ఎంపీలు అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం అని చెప్పాడు
– హోదా జగన్ తో సాధ్యం అని నమ్మితే…అధికారం అనుభవిస్తూ ఒక్క ఉద్యమం చేయలేదు
– రాజీనామాలు చేయలేదు.ఢిల్లీలో దీక్షలు చేయలేదు.
ALSO READ : Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మరో మూడు రోజులే ఛాన్స్..!
– కనీసం కేంద్రాన్ని ఏనాడూ బెదిరించలేదు
– ఇద్దరు హోదాను విస్మరించారు
– హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవి… పరిశ్రమలు వచ్చేవి
– హోదా రాకపోవడానికి బాబు జగన్ ఇద్దరు ద్రోహులే
– హోదా కోసం నిజమైన ఉద్యమాలు లేనే లేవు
– ఇద్దరు కలిసి బీజేపీ మెడలు వంచి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది
– హోదా తో పాటు పోలవరం,రాజధాని,కడప స్టీల్,రైల్వే జోన్…అన్ని పెండింగ్
– ఒక్క హమిపై మోడీని ఇద్దరు నిలదీయలేదు
– బీజేపీ పై పోరాటాలు పక్కన పెడితే .రాష్ట్ర ప్రయోజనాలు మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు
– ఇప్పుడు పోటీలు పడి బీజేపీ తో పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నారు
– బానిసలు గా మారారు
– ప్రశ్నించాల్సిన పార్టీలు పొత్తులకు ఎగబడుతున్నాయి
– పోలవరం పూర్తి అయి ఉంటే ..20 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేది
– రాజధాని ను చంద్రబాబు సింగపూర్ చేస్తా అన్నాడు
– 3d లో చంద్రబాబు సినిమా చూపించారు.
– జగన్ ఆన్న మూడు రాజధానులు అన్నాడు.
– మూడు కాదు కాదా..ఇవ్వాళ ఒక్క రాజధాని కూడా లేదు
– బీజేపీ తో ప్రత్యక్ష పొత్తులకు ఎందుకు సిద్ధం అయ్యారు ?
– ఎందుకు బీజేపీ తో పొత్తులు పెట్టుకుంటున్నారు చంద్రబాబు సమాధానం చెప్పాలి
– బీజేపీ తో పొత్తు ఎందుకు చెప్పి ఓట్లు అడగాలి చంద్రబాబు
– ప్రజల ప్రయోజనాలు బాబు,జగన్ లు తాకట్టు పెట్టారు
– వైఎస్సార్ ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేకి
– అలాంటి బీజేపీ తో జగన్ ఆన్న ఎందుకు బానిస అయ్యారు సమాధానం చెప్పాలి
– వైఎస్సార్ వారసుడు అయితే వైఎస్సార్ పథకాలను ఎందుకు అమలు చేయలేదు ?
– వ్యవసాయాన్ని జగన్ ఆన్న ఎందుకు దండగ చేశారు
– 3 వేల కోట్లతో పంట నష్టం జరిగితే స్థిరీకరణ నిధి అన్నాడు
– ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.
ALSO READ : Inter Exams : 28 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఆ సమయం లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి..!
– రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేస్తున్నారు
– 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పి జగన్ ఆన్న మోసం చేశాడు
– మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ వేశాడు
– ఎన్నికల మందు 6 వేలతో దగా డీఎస్సీ వేశారు
– కాంగ్రెస్ పక్షాన ఆందోళన చేస్తుంటే… నన్ను స్టేషన్ లో ఈడ్చి పడేశాడు
– వైఎస్సార్ జలయజ్ఞం ప్రాజెక్ట్ లో 54 ప్రాజెక్ట్ లు కట్టాడు
– ఇందులో 42 ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంటే..జగన్ ఆన్న మ్యానిఫెస్టోలో పెట్టాడు
– 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ ను జగన్ ఆన్న పూర్తి చేయలేదు
– జగన్ ఆన్న హయాంలో హంద్రీనీవా ,గాలేరు నగరి కూడా పూర్తి కాలేదు
– కనీసం ఈ అనంతపురం జిల్లా కు కావాల్సిన ప్రాజెక్ట్ అనంత కూడా పట్టించు కోలేదు
– మద్యపాన నిషేదం అని మోసం చేశారు
– మద్యపాన నిషేదం అని చెప్పి ప్రభుత్వమే పూర్తి మద్యం అమ్ముతున్నారు
– పూర్తిగా నాసిరకం మద్యం అమ్ముతూ జనాలను చంపుతున్నారు
– రాష్ట్రంలో 25 శాతం మరణాలు పెరిగాయి.
ALSO READ : First List : టిడిపి, జనసేన ఫస్ట్ లిస్ట్ ఇదే..!
– మద్యం అమ్మకాలు ఒక మాఫియా..లెక్క పత్రాలు లేవు.
– తప్పుల మీద తప్పులు చేస్తున్నారు
– నా పుట్టింటి హక్కుల కోసమే నేను కాంగ్రెస్ లో చేరా
– నేను చెల్లెలు అని చూడకుండా నా మీద దాడులు చేస్తున్నారు
– డబ్బులు పోసి సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారు
– నాకు ఏ పార్టీలో చేరడానికి అయినా హక్కు ఉంది
– ఒకప్పుడు ఇదే చెల్లెలు…3200 km పాదయాత్ర చేసింది
– రాష్ట్ర హక్కుల కోసం ఇదే చెల్లులు ఉద్యమం చేసింది
– బాయ్ బాయ్ బాబు అంటూ ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు
– మీకోసం ఇదే చెల్లెలు ఇంత కష్టం చేస్తే…నా మీద,నా భర్త మీద నిందలు వేస్తున్నారు
– ఎన్ని నిందలు వేసినా వైఎస్సార్ బిడ్డ భయపడదు.
– ఆంధ్ర రాష్ట్ర హక్కులు సాధించే వరకు వైఎస్సార్ బిడ్డ ఇక్కడ నుంచి కదలదు
– వైఎస్సార్ హయాంలో సంక్షేమం ఒకవైపు,అభివృద్ధి రెండో వైపు
– సంక్షేమం ఇస్తూనే…అభివృద్ధి చేశారు
– అది వైఎస్సార్ మార్క్..అది ఇందిరమ్మ మార్క్
– జగన్ ఆన్న రేషన్ దుకాణాల ద్వారా 11 వస్తువులు ఇస్తా అన్నాడు
– బియ్యం తప్పా ఒక్కటి లేదు









