హత్య కేసు లో నిందితుని అరెస్టు

హత్య కేసు లో నిందితుని అరెస్టు

చర్ల,మనసాక్షి:

ఇటీవల కాలంలో చర్ల మండలం అంబేద్కర్ నగర్ లో చిప్పనపల్లి నాగేంద్రబాబు సన్నాఫ్ కాంతారావు అనే వ్యక్తినీ హత్య చేసిన నిందితున్ని చర్ల పోలీసులు సోమవారం అరెస్టు చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా చర్ల సి ఐ బి అశోక్ మాట్లాడుతూ జూలై 24 వ తారీఖున ముద్దాయి కొడుకు నామకరణ ఫంక్షన్ లో ముద్దాయి కనుకు సంతోష్ కి, మృతుడు చిప్పనపల్లి నాగేంద్రబాబు కు మధ్య జరిగిన వాగ్వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని చిప్పనపల్లి నాగేంద్రబాబును చంపాలనే ఉద్దేశంతో ముద్దాయి కనుకు సంతోష్ అదే రోజు రాత్రి తన ఇంట్లో నుండి రోకలిబండ తీసుకొని చిప్పనపల్లి నాగేంద్రబాబు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న నాగేంద్రబాబు తల మీద రోకలిబండతో కొట్టాడు .

 

రెండు, మూడుసార్లు విచక్షణారహితంగా కొట్టడం వలన, తలకు తలిగిన బలమైన గాయాలతో చిప్పనపల్లి నాగేంద్రబాబు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ జూలై 25వ తారీఖున మరణించడం జరిగిందని సి ఐ అశోక్ తెలిపారు.అరెస్ట్ కాబడిన ముద్దాయి కనుకు సంతోష్ నుండి మృతుని హత్య చేయడానికి ఉపయోగించిన రోకలిబండని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

 

అరెస్ట్ కాబడిన ముదాయి వివరాలు తెలుపుతూ కనుకు సంతోష్ సన్నాఫ్ వరప్రసాద్ 28,సం,, డీసీఎం డ్రైవర్ ఆర్ ఓ అంబెడ్కర్ నగర్ చర్ల అని తెలిపారు.అరెస్టు చేయబడిన నిందితుడిని జుడిషియల్ రిమాండ్ నిమిత్తం భద్రాచలం కోర్టు నందు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్ల ఎస్ ఐ లు వెంకటప్పయ్య, సూరి,లు పాల్గొన్నారు.