Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రైంసూర్యాపేట జిల్లా

Suryapet : హుజూర్‌నగర్ లో ఏటీఎంలో చోరీ.. నిప్పు పెట్టి పారారైన దుండగులు..!

Suryapet : హుజూర్‌నగర్ లో ఏటీఎంలో చోరీ.. నిప్పు పెట్టి పారారైన దుండగులు..!

మన సాక్షి, హుజూర్‌నగర్

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో ఎస్బిఐ ATM లో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి ఏటీఎం మిషిన్ కు నిప్పు పెట్టి పరారైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని లింగగిరి రోడ్డు లో ఉన్న ఎస్బిఐ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున చోరీకి పాల్పడి దోచుకున్నారు. ఆ తర్వాత ఏటీఎం మిషన్ కు నిప్పు పెట్టి పరారయ్యారు. నలుగురు వ్యక్తులు ఫార్చునర్ కారులో అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని ఒక లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది.

సిఐ చరమందరాజు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లే లోపే దుండగులు పరారైనట్లు సమాచారం. అయితే గ్యాస్ కట్టలతో లాకర్ పగలగొట్టి నగదును దొంగిలించి, గ్యాస్ కట్టర్ తో కట్ చేసే సమయంలో కొంత నగదు కూడా కాలిపోయినట్లు తెలుస్తుంది.

వెంటనే ఫైర్ సిబ్బందిని పిలిపించే అధికారులు మంటలు అర్పించారు. సుమారు 20 లక్షల రూపాయల వరకు నగదు ఉండవచ్చునని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ :

  1. BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  4. District collector : భూ భారతి చట్టంలో సాదా బైనమా అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే..

  5. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

 

మరిన్ని వార్తలు