Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : శానిటరీ అధికారుల దాడులు.. రాయల్ పుడ్ కోర్ట్ కు జరిమానా..! 

BREAKING : శానిటరీ అధికారుల దాడులు.. రాయల్ పుడ్ కోర్ట్ కు జరిమానా..! 

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ (శరభమ్మ హోటల్) ప్రాంతంలో గల రాయల్ ఫుడ్ కోర్ట్ పరిసరాలు, మరియు లోపల అపరి పరిశుభ్రంగా వున్ననందున మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాసు ఆదేశంల మేరకు సానిటరీ అధికారులు, జవాన్లు, సిబ్బంది తనిఖీ చేసి ఇట్టి పుడ్ కోర్టు యాజమాని జానీపాషా కు రూ 5000/- లు జరిమానా వేయడం జరిగింది.

ఈ సందర్భంగా కమీషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలో హోటల్స్ యాజమాన్యాలు ,పెట్టి వెండర్స్ వ్యాపారం చేసే వారు ఎవరు ఆయిన తమ పరిసరాలను ,హోటల్స్ లోపల పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కోరారు.మురిగి ,పులిసి పోయిన ,నిల్వ ఉంచిన పదార్ధాలను వాడిన అట్టి హోటల్స్ ను సీజ్ చేయడం తో పాటు భారీ మొత్తంలో పెనాల్టీలు వేయడం జరుగుతుందన్నారు.

హోటల్స్ చుట్టూ ప్రక్కల వారికీ ఇబ్బంది కలగా కుండా వ్యాపారం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ లు సారగండ్ల శ్రీనివాస్ , బూర సతీష్,హెల్త్ అస్సిటెంట్ మాస్కపురం సురేష్ ,జవాన్లు మొలకల పల్లి పరుశురాములు,పిడమర్తి ప్రసాద్ , దండు ఉపేందర్ , జి.మల్లేష్త దితరులు పాల్గొన్నారు.

ALSO READ :

KTR : ఆసరా పెన్షన్ దారులకు నోటీసులు.. సొమ్ము వెనక్కు లాక్కునే ప్రయత్నం, కేటీఆర్ సంచలన ట్వీట్..!

TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!

మరిన్ని వార్తలు