Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Bhadrachalam : భద్రాచల సీతారాముల పెళ్లికి సుగంధ హారాలు..!

Bhadrachalam : భద్రాచల సీతారాముల పెళ్లికి సుగంధ హారాలు..!

శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి సమర్పించిన : నాసిరెడ్డి సాంబశివ రెడ్డి

మంగపేట, మన సాక్షి ప్రతినిధి :

భద్రాచలం సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా అరుదైన సుగంధ హారాలతో ఆలయ అర్చకులు స్వామి వారి కళ్యాణం జరపనున్నారు. ఈ నెల 17, బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణ కార్యక్రమం సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి కేరళ రాష్ట్రం నుండి స్వామి వారి కోసం యాలకులతో సుగంధ హస్త కళాకారుల చేత ప్రత్యేకంగా రూపొందించిన సుగంధ హారాలను మంగళవారం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు మరియు అర్చకులకు సమర్పించారు.

అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ. భద్రాచలం లో బుధవారం జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ గా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన యాలకుల హారాలను బహూకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని దేవుడి ఆశీస్సులు చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలని ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలని ప్రార్థించినట్టు తెలిపారు.

శ్రీరామనవమి రోజు సుగంధ హారాలను స్వామి వారికి కల్యాణ మండపంలో సమర్పించాలని. అనుకున్నామని కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కోడ్ అమల్లో ఉన్నందున సుగంధ హారాలను దేవస్థానం అధికారులకు ఒకరోజు ముందుగానే మంగళవారం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎఈవో రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసరాజు, వాసు, ఆలయ అర్చకులు అమరవాది మురళి కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!

మరిన్ని వార్తలు