Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర

భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర

శేరిలింగంపల్లి , మన సాక్షి:

భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాదయాత్ర మాదాపూర్ డివిజన్లోని గోకుల్ ఫ్లాట్స్ హనుమాన్ టెంపుల్ కాలనీలో బిజెపి సీనియర్ నాయకులు మువ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు స్థానిక ప్రజలు అక్కడ ఉన్న సమస్యలను మువ్వ సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు.

 

ఈ కాలనీలో దోమల బెడద కుక్కల బెడద అస్తవ్యస్తమైన రోడ్లు తదితర అంశాలను మువ్వా సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు ఈ పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వేల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

 

ALSO READ : 

  1. Road Accident : రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం.. అంతా ఓకే కుటుంబానికి చెందినవారు..!
  2. Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!
  3. TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!
  4. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
  5. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
  6. Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
  7. How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!

 

అధికార పార్టీ నాయకులు మాత్రం ఈ నియోజకవర్గాన్ని తుంగలో తొక్కారు టిఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.

 

రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి దే అధికారం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రవీందర్రావు ,జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ జిల్లా కార్యదర్శి హరికృష్ణ , మాదాపూర్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదన చారి గోవర్ధన్ రెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం , ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు జంగయ్య యాదవ్, బీజేవైఎం నాయకులు ఆనంద్ , శేర్లింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి చిట్టారెడ్డి ప్రసాద్, డివిజన్ నాయకులు బస్తి నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు