సూర్యాపేట : సంసార జీవితానికి అడ్డొస్తున్నాడని ఆరేళ్ల బాలుడి హత్య

సూర్యాపేట : సంసార జీవితానికి అడ్డొస్తున్నాడని ఆరేళ్ల బాలుడి హత్య

సూర్యాపేట రూరల్, మనసాక్షి

సంసార జీవితానికి అడ్డు వస్తున్నాడని, తనతో భర్త ప్రేమగా ఉండటం లేదని అభం శుభం తెలియని బాలుడిని గొంతు నులిమి చంపి సాధారణ మరణంగా చిత్రీకరించింది ఓ మహిళ.
ఆరు సంవత్సరాల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సూర్యాపేట పట్టణం శివారులోని ఇందిరమ్మ కాలనీ ఫేస్3 లో ఈనెల 4 వ తారీఖున చోటుచేసుకుంది.

 

ఈ కేసుకు సంబంధించిన నిందితురాలిని సోమవారం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు డిఎస్పి నాగభూషణం మీడియా ముందు వెల్లడించారు ఇందిరమ్మ కాలనీకి చెందిన మచ్చ మధు2015లో కులాంతర వివాహం చేసుకున్నాడు వారికి 2017లో బాబు టైసన్ (6) జన్మించాడు. అయితే వారి మధ్య విభేదాలు వచ్చి పుట్టిన బాబును మధు దగ్గర వదిలి ఆమె వేరే వివాహం చేసుకుంది.

 

మధుకు సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వారం గ్రామానికి చెందిన బొడ్డు వాణి అనే అమ్మాయిని సంవత్సరం క్రితం నిశ్చితార్థం చేసుకొని ఇందిరమ్మ కాలనీలో మధు వాడితో సహజీవనం చేస్తున్నాడు మధు మొదటి భార్య కొడుకు టైసన్ (6) వారి దగ్గర ఉంటున్నాడు బాలుడు సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఈ నెల 4న శుక్రవారం సాయంత్రం టైసన్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాక కడుపులో నొప్పిగా ఉందని వాణితో చెప్పాడు.

 

ALSO READ; 

  1. అడవిదేవులపల్లి : బాల్నేపల్లిలో ఆస్తి కోసం హత్య
  2. అనుమానాస్పద స్థితిలో 6 సంవత్సరాల బాబు మృతి
  3. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
  4. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!

 

దీనితో బాబు వల్ల మేము ఆనందంగా ఉండలేకపోతున్నామని సంసార జీవితానికి అడ్డు వస్తున్నాడని ప్రతి విషయంలో మధు బాలుడిని మంచిగా చూసుకుంటున్నాడని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోపం పెంచుకున్న వాణి కడుపు నొప్పితో మంచం మీద పడుకున్న టైసన్ ను బలంగా రెండు చేతులతో గొంతు పిసికింది దీంతో కొద్దిసేపు ఊపిరి ఆడక టైసన్ మంచం మీద కొట్టుకొని ఊపిరి వదిలాడు.

 

బాలుడిని గొంతు నులిమి చంపిన వాణి బాలుడు చనిపోయాడని నిర్ధారించుకొని ఏమి తెలియనట్లుగా వాణి మధుకు ఫోన్ చేసి విషయం చెప్పింది మధు హుటా హుటిన సాయంత్రం 6-30 కి ఇంటికి రాగానే టైసన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు.

 

మధు బాబుకు ఏమైందని వాణి ని అడిగాడు కడుపునొప్పని ఏడ్చి ఏడ్చి పడుకున్నాడని నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు అని మధుని నమ్మించింది. మధు వెంటనే బాబుని పట్టణంలోని నియో పిల్లల ఆసుపత్రికి తరలించారు బాబు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మధు నిజంగానే అనారోగ్యంతో బాబు చనిపోయాడని నమ్మాడు.

 

ఈ సమావేశంలో రూరల్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై ఆర్ సాయిరాం, సిబ్బంది బాబు అస్గర్ శ్రీను తదితరులు ఉన్నారు.