Nalgonda : వానాకాలం నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కింద కాలువలకు నీరు..!

వచ్చే వానకాలం నాటికి బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టు కింద అన్ని కాలువలకు నీరు తీసుకువస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Nalgonda : వానాకాలం నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కింద కాలువలకు నీరు..!

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్లగొండ, మన సాక్షి:
వచ్చే వానకాలం నాటికి బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టు కింద అన్ని కాలువలకు నీరు తీసుకువస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం అయన నకిరేకల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెళ్లెముల గ్రామంలో సుమారు 67 కోట్ల రూపాయల విలువచేసే ఆర్ అండ్ బి రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక చంద్రమ్మ అనే పేద మహిళలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని నూతనంగా ఏర్పాటైన రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, సబ్సిడీ ఎల్పిజి కనెక్షన్, సొంత స్థలం ఉన్చ వారికి 5 లక్షల రూపాయలతో ఇందిర ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, మహాలక్ష్మి పథకం కింద పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఇటీవల భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించిన వెంటనే తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెళ్లేములలో చంద్రమ్మ అనే మహిళకు ఇందిరమ్మ ఇంటికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించామని తెలిపారు.

బ్రాహ్మణ వెళ్లేములలో ప్రత్యేకించి తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల అవసరాలన్నీ, వారి సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు . గ్రామంలో ఇండ్లు లేని 200 మంది నిరుపేదలకు 3 ఎకరాలలో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని , గ్రామంలో వెటర్నరీ ఆసుపత్రి నిర్మిస్తామని, 2 నెలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితులలో బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ప్రతీక్ రెడ్డి పేరుతో లైబ్రరీని ఏర్పాటు చేస్తామని, గ్రామంలోని ప్రతి మహిళా సంఘానికి కోటి రూపాయలు ఇస్తామని ,రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో లక్ష కోట్లతో మహిళా సంఘాల ను కోటీశ్వరులుగా చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.

బ్రాహ్మణ వెళ్లేముల గ్రామంలో స్వయం సహాయక మహిళ సంఘ భవనాన్ని కట్టిస్తామని, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి సోలార్ గ్రామంగా తీర్చిదిద్దుతామని, అంతేకాక కెనరా బ్యాంకు శాఖను ఏర్పాటు చేస్తామని తెలిపారు అంతకుముందు మంత్రి నల్గొండ- మునుగోడు రోడ్డు వాటి ఇష్టం చేసే 30 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నార్కెట్పల్లి- మునుగోడు బ్రాహ్మణ వెల్లేముల పోర్షన్ సంబంధించి 12 కోట్ల రూపాయలతో రహదారి వెడల్పు పటిష్టం చేసే పనులకు, అలాగే నల్గొండ- మునుగోడు చిట్యాల వయా నేరడ రోడ్డు వెడల్పు, పటిస్టం చేసే 25 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు.

జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభలు వేముల వీరేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు మాట్లాడారు. రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డిఓ రవి స్థానిక మండల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!