Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైం

BREAKING : కరీంనగర్ జిల్లాలో బావిలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం..!

కరీంనగర్ నగర శివార్లలోని రేకుర్తి బతుకమ్మ చెరువు సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర శోకసంద్రాన్ని మిగిల్చింది. ఈత కొట్టడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు బావిలో మునిగి గల్లంతైన 16 ఏళ్ల బాలుడు షాకీర్ ఖాన్ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది సుమారు రెండు మూడు గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు వెలికితీశారు.

BREAKING : కరీంనగర్ జిల్లాలో బావిలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ నగర శివార్లలోని రేకుర్తి బతుకమ్మ చెరువు సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర శోకసంద్రాన్ని మిగిల్చింది. ఈత కొట్టడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు బావిలో మునిగి గల్లంతైన 16 ఏళ్ల బాలుడు షాకీర్ ఖాన్ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది సుమారు రెండు మూడు గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు వెలికితీశారు.

స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేకుర్తి పరిధిలోని స్వామి కాలనీకి చెందిన ఆజిమ్ ఖాన్ కుమారుడు షాకీర్ ఖాన్ (16) శనివారం సాయంత్రం సరదాగా ఈత కొట్టేందుకు బతుకమ్మ చెరువు సమీపంలోని ఒక బావిలోకి దిగాడు. అయితే, నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ఆ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. తోటి స్నేహితులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది రిస్క్యూ టీం మరియు స్థానిక ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర శ్రమ అనంతరం బాలుడిని నిర్జీవంగా బయటకు తీశారు. షాకీర్ ఖాన్ అప్పటికే మృతి చెందడంతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో రేకుర్తి స్వామి కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు