Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్

Marigolds : విరగబూసిన బంతిపూలు.. ఐనా రైతుల దిగాలు..!

Marigolds : విరగబూసిన బంతిపూలు.. ఐనా రైతుల దిగాలు..!

రామసముద్రం, మనసాక్షి:

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని బంతి పూలు వేసిన రైతులకు ధరలు లేక వారంరోజులు గా తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం క్రితం కిలో బంతి ధరలు 60/70 రూపాయలు పలికేవి. ఇప్పుడు ఒక బస్తా బంతి పూలు 100రూపాయలు పలుకుతున్నాయి.

ఒక కిలో బంతి 5-6 రూపాయలు పలకడం తో రైతులు దిగులు చెందుతున్నారు. మండలంలోని పలు పంచాయతీ లలో తిరుమలరెడ్డిపల్లె , ఊలపాడు. చీర్లపల్లె, మచ్చు వారిపల్లె,  నారిగానిపల్లె చొక్కాండ్లపల్లె, ఆర్ నడింపల్లె, మినికి చెంబకూరు, నారిగానిపల్లె, కాప్పల్లె పంచాయతీ లలో అధికంగా బంతి పూలు సాగు చేస్తారు.

ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతిని నమ్ముకొని భూమిపై ఆధారపడి ఒక పంట పోతే మరో పంట వస్తు ధన్న ఆశతో పూల పంట వేసి దిగుబడి బాగా వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేదు. చేసిన అప్పులు తీర్చలేక అప్పులు పాలైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

(Reporting : Venu Raju, ManaSakshi)

(Ramasamudram, AP)

MOST READ : 

మరిన్ని వార్తలు