మిర్యాలగూడ : అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరికలు
మిర్యాలగూడ : అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరికలు
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి సబ్బండ వర్గాలు బిఆర్ఎస్,పార్టీలో చేరుతున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.
నియోజకవర్గంలో వేములపల్లి మండలం కామేపల్లి గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన 100మంది కార్యకర్తలు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి అద్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ALSO READ :
Pavan Kalyan : రాబోయే ఎన్నికల్లో పొత్తు పై పవన్ కళ్యాణ్ క్లారిటీ.. సంచలనం నిర్ణయం..!
పార్టీలో చేరిన హుస్సేన్, పర్వతం రాములు, సైదులు, వెంకన్న, సాలయ్య, దర్గయ్య తదితరులకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలఅభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండవర్గాల పేదలను ఆదుకునే లక్ష్యంతో అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారన్నారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రజలు స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.పార్టీ కొరకు కష్టపడే కార్యకర్తలతో పాటు పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు.
ALSO READ :
Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
ఈ కార్యక్రమంలో మాడ్గులపల్లి మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, వేములపల్లి సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, మాజీ సర్పంచ్ ఉత్తెర్ల వెంకటేశ్వర్లు, కొనకంచి చంద్రశేఖర్, నిడుగొండ రామచంద్రు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!










