Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి
చేవెళ్లలో మహిళ దారుణ హత్య..!
ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

చేవెళ్లలో మహిళ దారుణ హత్య..!
చేవెళ్ల, (మన సాక్షి):
ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మసాగర్ గ్రామానికి చెందిన ఎరుకల మైసమ్మ (50)ను బుధవారం గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు నరికి, గొంతు కోసి అతి దారుణంగా చంపారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు కూడా లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారంతో చేవెళ్ల సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పట్టీలు, నగల కోసం చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.









