Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Nelakondapalli : నేలకొండపల్లిలో అర్ధరాత్రి సజీవ దహనం..!

Nelakondapalli : నేలకొండపల్లిలో అర్ధరాత్రి సజీవ దహనం..!

నేలకొండపల్లి, మన సాక్షి:

ప్రమాదవశాత్తు వృద్ధుడు సజీవ దహానమయ్యాడు… స్థానికులు, కుటుంబ సభ్యుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని చెన్నారం గ్రామానికి చెందిన పగడాల నాగయ్య (88) అనే వృద్ధుడు మంటలలో సజీవ దహనమైయ్యాడు.

ఇటీవల నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. శనివారం సాయంత్రం నరాల బలహీనత వలన ఇంట్లో ఉన్న గాబులో కూడ పడ్డాడు. స్థానికులు గమనించి బయటకు తీశారు.

ప్రతీ రోజు బీడిలు తాగే అలవాటు ఉంది. తాను ఉంటున్న రేకుల షెడ్లో శనివారం రాత్రి బీడి కాల్చిందుకు లైటర్ వెలిగించుకునే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు బట్టలకు అంటుకుని మంటలలో కాలిపోయి -ఉంటాడని స్థానికులు, కుటుంబ సభ్యులు పేర్కోంటున్నారు.

అర్ధరాత్రి’ కావటంతో ఈ విషయం ను ఎవరూ గమనించలేదు. అదివారం తెల్లారినతరువాత వృద్ధుడు బయటకు రాకపోవటంతో అనుమానంతో కోడలు ఇంట్లోకి వెళ్లి చూడగా…మంటలలో సజీవదహానమై విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి బోరున విలపించారు.

మృతుడు కోడలు వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ను నేలకొండపల్లి ప్రభుత్వ హస్పిటల్ పోస్టుమార్టమ్ ను నిర్వహించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు