కారు బైక్ ఢీకొని యువకుడు మృతి..!

కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం మోకిల భారత్ పెట్రోల్ పంపు వద్ద టాటా హరియర్ కారు (TS 34 J 0070) ను అజాగ్రత్తగా రోడ్డుపై నిలిపారు.

కారు బైక్ ఢీకొని యువకుడు మృతి..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం మోకిల భారత్ పెట్రోల్ పంపు వద్ద టాటా హరియర్ కారు (TS 34 J 0070) ను అజాగ్రత్తగా రోడ్డుపై నిలిపారు.

శంకర్‌పల్లి పట్టణానికి చెందిన అరవింద్ (23), శ్రీకాంత్ (26) ఇద్దరు స్నేహితులు బైక్ పై హైదరాబాద్ నుండి శంకర్‌పల్లికి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డుపై నిలిపిన కారును వెనుక నుండి ఢీకొట్టారు. బైక్ పై ఉన్న ఇద్దరికీ తీవ్రంగా గాయాలు కాగా అరవింద్, శ్రీకాంత్ ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అరవింద్ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ALSO READ : BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!