కంప చెట్ల పొదలలో పసి పాప..!

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి పునరవాస కేంద్రం సుల్తాన్ పురం తండా వద్ద బుధవారం పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్లలో వదిలిపెట్టి వెళ్లిన సంఘటన జరిగింది.

కంప చెట్ల పొదలలో పసి పాప..!

మఠంపల్లి, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి పునరవాస కేంద్రం సుల్తాన్ పురం తండా వద్ద బుధవారం పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్లలో వదిలిపెట్టి వెళ్లిన సంఘటన జరిగింది. సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ వివరాలు తెలిపారు సుల్తాన్ పురం తండా గ్రామ శివారులోని కంప చెట్ల పొదలలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పసి పాప శిశువును వదిలి వెళ్ళినట్టు తెలిపారు.

స్థానికులు పసి పాప ఏడుపు విని పోదలో శిశువును చూసి అంగన్వాడి ఆశాలకు సమాచారం అందించగా వారు తమకు తెలియజేశారని అన్నారు. బయటికి తీసి మఠంపల్లి మండల వైద్య కేంద్రానికి తీసుకెళ్లామని అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలియజేశారు. అక్కడ డాక్టర్లు పసిపాపను చికిత్స అందించారని కానీ ఆ పాపకు కంపచెట్లలో విసిరేయడం వల్ల శరీర భాగాల్లో అక్కడక్కడ ముల్లులు గుచ్చుకున్నాయని తెలిపారు.

అలాగే కొన్ని టెస్టులు చేసేందుకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి అంగన్వాడి టీచర్ ఉమా, ఆశా వర్కర్ శాంతి చికిత్స నిమిత్తం పంపించామన్నారు. ఆ పాప డెలివరీ అయి ఒకటి రెండు రోజులు కావచ్చు అని డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. పాప బరువు 2.7 కిలోలు ఉందని అన్నారు. ఈ పాప దొరికిన స్థలం ఆంధ్రకు తెలంగాణ రాష్ట్రంలో బార్డర్ కావడంతో ఆ పసిపాపను ఇక్కడ చెందిన వారు వదిలేసారా లేక ఆంధ్ర నుంచి ఇక్కడ పడేసి వెళ్లిపోయారని తెలియాల్సి ఉంది.