Press Club : చింతపల్లి మండల ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా ఎన్నిక..!

చింతపల్లి మండల కేంద్రంలో బుధవారం సీనియర్ పత్రిక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

Press Club : చింతపల్లి మండల ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా ఎన్నిక..!

చింతపల్లి.  మన సాక్షి.:

చింతపల్లి మండల కేంద్రంలో బుధవారం సీనియర్ పత్రిక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో జర్నలిస్టులకు సంబంధించిన అన్ని విషయాలు క్షుణంగా చర్చించుకుని చింతపల్లి మండలంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ సమన్యాయం జరిగే విధంగా నియమ నిబద్ధత తో కమిటీ పనిచేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పుప్పాల వెంకటేశ్వర్లు( మన సాక్షి ) ప్రధాన కార్యదర్శిగా పసునూరి వెంకటేష్( వార్త మిర్రర్ ), కోశాధికారిగా వనమాల వెంకటేష్( ఈనాడు), ఉపాధ్యక్షులుగా( జిల్లా నరసింహ గౌడ్) నవతెలంగాణ,జాయింట్ సెక్రటరీగా నాగిళ్ల రేణుక( దిశ ) ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ముక్తాల శేఖర్( ఆంధ్రప్రభ) కోలుకులపల్లి కొండల్ ( సాక్షి) కురుమేటి అభిలాష్ ( నిజం) కోట్ల అరవింద్ ( జనసముద్రం) చింతకుంట రాకేష్ ( వెలుతురు) ఆడెపు సతీష్( శరణార్థి) తదితరులను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంజరిగింది.

ఈ సందర్భంగా కమిటీ నిర్ణయం ప్రకార ఎప్పటికప్పుడు ప్రజలతో, అధికారులతో, ప్రజా ప్రతినిధులతో అందరి సహాయ సహకారాలతో క్లబ్ ను ముందుకు నడిపిస్తామని ముందుకు నడిపిస్తామని నూతన అధ్యక్షులు పుప్పాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

ALSO READ :

BREAKING : ముందస్తు సెలవు లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే సస్పెండ్.. ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?