Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా

సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ..!

సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ..!

మహబూబాబాద్, మన సాక్షి :

గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని, పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ జిల్లా కేంద్రం చేరుకుంది.

మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్, అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో , రెవెన్యూ, డేవిడ్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య స్వాగతం పలికి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఈ టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.

ఇప్పటివరకు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్,కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, ములుగు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించారని, జిల్లాలో మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు, నుండి జనగామకు వెళ్తుందని తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ యువత క్రీడల్లో వారి యొక్క సత్తాను చాటాలని అందుకు ముఖ్యమంత్రి కప్ మంచి అవకాశమన్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం కప్ నోడల్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ కన్నం మధు, జిల్లా స్పోర్ట్స్ అధికారి అనిల్, గోకుల్, రతన్ కుమార్ బోస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్, జిల్లా అధికారులు కలెక్టరేట్లోని అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు