సీఎం పర్యటన విజయవంతం చేయాలి

సీఎం పర్యటన విజయవంతం చేయాలి ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు

సీఎం పర్యటన విజయవంతం చేయాలి

ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు

నడిగూడెం, మన సాక్షి :

ఈ నెల 20వ తేదీన సూర్యాపేట జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటనను విజయవంతం చేయాలని మండల పరిషత్ అధ్యక్షురాలు యాతాకుల జ్యోతి మధుబాబు అన్నారు.

 

గురువారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య ఆదేశానుసారం మండలం నుండి పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు దేవబత్తిని సురేష్ ప్రసాద్, గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య అనంతుల ఆంజనేయులు పిఎసిఎస్ చైర్మన్ లు పుట్టా రమేష్, గోసుల రాజేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 

Most Read : 

  1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  2. TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. టి – 24 టికెట్..!
  3. నారాయణపేట : పనులలో జాప్యం చేసిన అధికారుల పై జిల్లా అదనపు కలెక్టర్ ఆగ్రహం
  4. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!