Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
గోసంరక్షణకై సంతకాల సేకరణ..!
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని... గోవధ నిషేధించాలని తదితర డిమాండ్లతో ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గోసంరక్షణకై సంతకాల సేకరణ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని… గోవధ నిషేధించాలని తదితర డిమాండ్లతో ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరక్ష జిల్లా ప్రముఖ్ మిస్కిన్ సందీప్ మాట్లాడుతూ కోసం రక్షణ చట్టాల ను పటిష్టం చేయాలన్నారు.
గో సేవ లక్ష్యంగా ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి గోసంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 1200 మంది గోసంరక్షణ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విహెచ్ పీ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, నగర గోరక్ష ప్రముఖ్ అనిల్, పట్టణ అధ్యక్షుడు మురళి భట్టడ్, జిల్లా బజరంగ్ సంయోజక్ శ్రావణ్, ఆకాష్, చక్రి, చరణ్, అరవింద్, రాజశేఖర్, రాఘవ, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.










