రుణమాఫీ, వరద సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..!
రుణమాఫీ, వరద సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..!
సూర్యాపేట, మనసాక్షి :
రెండు లక్షల రుణమాఫీ పై వెంటనే స్పష్టత ఇవ్వాలి,
ఇచ్చిన హామీలు నెరవేర్చక వచ్చిన సమస్యలను పరిష్కరించక ప్రజలను గందరగోలంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం నెడుతున్నదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయినా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9 నెలల పరిపాలనలో రైతు రుణమాఫీ పై అర్దం లేని స్పష్టతలేని నిర్ణయాలతో రైతన్నని గందరగోళంలోకి నేడుతున్నారని అన్నారు.
రుణమాఫీ 49 వేల కోట్లు చేస్తామని చెప్పి చివరికి 31,000 అని చెప్పి బడ్జెట్లో 26 వేల కోట్లు కేటాయించి 18 వేల కోట్లు విడుదల చేసి రైతులకు పదివేల కోట్లు మాత్రమే చేరవేశారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదని రైతు రుణమాఫీ పై వెంటనే స్పష్టత ఇవ్వాలని రెండు లక్షల పైన రుణం ఉంటే బ్యాంకులో కట్టాలని, చెబితే రైతులు అప్పు చేసి రెండు లక్షల పైన ఉన్న రుణం కట్టారని ఇప్పటికి రెండు లక్షల రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రుణం కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉందని ఇది తప్పించుకునే ప్రయత్నంలా ఉందన్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేయడమే కాకుండా అధికారంలోకి వచ్చి మోసం చేయడం దేశ చరిత్రలో తెలంగాణలోనే ఇది ప్రథమం అన్నారు.
కరెంటు విషయానికి వస్తే ఇటీవల మా మిత్రుడు ఒకరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటికి వెళితే అరగంటలో ఐదు ఆరుసార్లు పోయిందని మళ్లీ పాత పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఇంట్లో టీవీలు ఫ్రిజ్లు కాలిపోవడం ఆటోమేటిక్ జనరేటర్ల సైతం కాలిపోతున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యక్తిగత అవసరాలకు మంత్రులు ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నారు తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించడంలో దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది రైతులేనని రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తారని ఆశపడి ఓట్లు వేశారని రకరకాల మాటలతో రైతులను గందరగోళంలో పెడుతూ మోసం చేస్తుందని అన్నారు.
వానకాలం పెట్టుబడికి రైతులు అప్పు చేసి పెట్టుబడి పెట్టారని వానాకాలం పంట చేతికి వచ్చే సమయం వస్తున్న నేటి వరకు రైతుభరోసా ఇవ్వలేదని ఇది ఎక్కడి అన్యాయం అన్నారు. సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు ప్రాంతాల్లో రైతులు పంట నష్టపోయారని వారికి వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరద బాధితులకు సాయం చేస్తున్నామని చెబుతున్న ఇప్పటివరకు ఎలాంటి సాయం చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎవరికి కావాలి పది వేలు మా ఇంట్లో వచ్చి అరగంట ఉంటే మా బాధ తెలుస్తుందని ప్రజలు ఆవేదన చేస్తూరు. మంత్రులకు వెళ్లి ఆ ఇండ్లలో అరగంట నిలబడే దమ్ము ఉందా అన్నారు. ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తుంటే మాపై దాడులు చేసి దూర్మార్గానికి పాల్పడ్డారని ఆరోపించారు.
బ్యాంకులకు ప్రస్తుతం 2 లక్షల పైన రుణమాఫీ కట్టవద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్ననని చెప్పారు. రైతుకు బ్యాంకులో అప్పు ఎంతైనా ఉండొచ్చని ప్రభుత్వం ఇస్తామన్న రెండు లక్షల రుణమాఫీ వెంటనే బ్యాంకులో జమ చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశం లో బి ఆర్ ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్ రావు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జీడీ బిక్షం, నెమ్మది బిక్షం తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
నల్లగొండ మున్సిపాలిటీకి అత్యుత్తమ గౌరవం.. దేశంలోనే రెండో స్థానం.. 25 లక్షల నగదు పురస్కారం..!
BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!
Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!









