Congress Party : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు మరో కొత్త పథకం.. విద్యార్థులకు..!
Congress Party : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు మరో కొత్త పథకం.. విద్యార్థులకు..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతుంది. అందుకు వివిధ పార్టీల నుంచి నాయకులను చేరికలతోపాటు ప్రజలను ఆకర్షించే విధంగా 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీలతో పాటుగా రైతు, యువత ,దళిత డిక్లరేషన్ లోను ఆకర్షణీయమైన హామీలను టీపీసీసీ ప్రకటించింది. అదేవిధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా మరో పథకాన్ని తెరమీదకి తీసుకువచ్చింది.
కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో ఇటీవల ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీలతో పాటుగా రైతు, యువత, దళిత డిక్లరేషన్లలోను ఆకర్షణీయమైన హామీలను టిపిసిసి ప్రకటించింది. రాష్ట్రంలోని విద్యార్థులను ఆకట్టుకునే విధంగా మరో కొత్త హామీని తెరమీదకి తీసుకొచ్చింది.
ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్ లో సమావేశమైన టిపిసిసి మేనిఫెస్టో కమిటీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకురావాలని కూడా నిర్ణయించింది.
ఆటో డ్రైవర్ల సంఘాలతో సమావేశమై దానికి సంబంధించిన సమాచారం ఫీడ్ బ్యాక్ తీసుకొని కమిటీ నిర్ణయం తీసుకోనున్నది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు కమిటీ సభ్యులు సీతక్క, మాజీ మంత్రులు సంబాని చంద్రశేఖర్ , ప్రసాద్ కుమార్ లు పాల్గొన్నారు. వివిద వర్గాల నుంచి వచ్చిన సూచనలు, ప్రతిపాదనలు సమీక్షించి మ్యానిఫెస్టోలో పెట్టే విధంగా సమీక్షించారు. అక్టోబర్ 2 నుంచి జిల్లాల పర్యటన నిర్వహించాలని కమిటీ సభ్యులు కూడా నిర్ణయించారు.
అక్టోబర్ 2వ తేదీన ఉదయం, ఆదిలాబాద్ సాయంత్రం నిజాంబాద్ జిల్లాల్లో కమిటీ పర్యటించనుంది. అదేవిధంగా సిఆర్పిఎఫ్ రిటైర్డ్ జవాన్లు టిపిసిసి మేనిఫెస్టో కమిటీని కలిసి వారి సమస్యలు పరిష్కారానికి మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను కమిటీకి సూచించారు.
ALSO READ :
హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!









