BREAKING : మేడ్చల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. కాలనీలో హై టెన్షన్..!

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అక్రమ నిర్మాణాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.

BREAKING : మేడ్చల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. కాలనీలో హై టెన్షన్..!

హైదరాబాద్ (మేడిపల్లి) మన సాక్షి :

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అక్రమ నిర్మాణాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీ, సాలార్జంగ్ కంచె సర్వేనెంబర్ 1, 10 లో సోమవారం ఉదయం నుంచి అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు జరుపుతున్నారు.

మేడిపల్లి మండల తాసిల్దార్ హసీనా.. సిబ్బందితో కలిసి పోలీస్ బంద్ బస్త్ మధ్య నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. తమకు అన్ని అనుమతులు ఉన్నా.. కావాలనే ఇళ్లను కూల్చివేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా హై టెన్షన్ వాతావరణ నెలకొన్నది. కార్పొరేటర్లు పోచయ్య, హరీష్ శంకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కుల్చివేతలు చేపడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

ALSO READ : 

GreenTea : గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్ని లాభాలా.. అవేంటో తెలుసుకుందాం..!

Hair Growth : జుట్టు పెరుగుదల, బట్టతల రాకుండా ఏం చేయాలి.. నేచురల్ గా పెరుగుతుంది..!

NALGONDA : నల్గొండలో చెరువు భూములు కబ్జా.. చెరువు శిఖంలో నిర్మాణాలు..!