NALGONDA : నల్గొండలో చెరువు భూములు కబ్జా.. చెరువు శిఖంలో నిర్మాణాలు..!

నల్లగొండ జిల్లా కేంద్రంలో పట్టణానికి ఆనుకొని ఉన్న వల్లభరావు చెరువు, బతుకమ్మకుంట భూములు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువులలో అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

NALGONDA : నల్గొండలో చెరువు భూములు కబ్జా.. చెరువు శిఖంలో నిర్మాణాలు..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా కేంద్రంలో పట్టణానికి ఆనుకొని ఉన్న వల్లభరావు చెరువు, బతుకమ్మకుంట భూములు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువులలో అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గతంలో మత్స్యకారుల సంఘం నాయకులు అధికారుల దృష్టికి తీసుకుపోగా నిర్మాణాలను కూల్చివేశారు. ఆ తర్వాత తిరిగి యధావిధిగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

చెరువును పరిశీలిస్తున్న మత్స్యకార సంఘ నాయకులు

 

ఆదివారం మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ బతుకమ్మ కుంట చెరువు భూముల్లో నిర్మాణాలను కబ్జాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నాలుగు ఏళ్లుగా పల్లభరావు చెరువు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పోరాటం చేస్తున్నానని అన్నారు. గతంలో జిల్లా యంత్రాంగం కదలి వచ్చి చెరువు భూముల్లోని నిర్మాణాలను డోజర్ లను పెట్టి మరీ కూల్చివేశారని, కానీ సర్వే చేసి నూతన హద్దురాల్లను నాటి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని పలుమార్లు కోరినా కూడా ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే చేయకుండా అశ్రద్ధ చేస్తున్నారని అన్నారు.

మళ్లీ యదేచ్చగా భూమి కబ్జాలు చేసి కట్టడాలు కట్టినారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కట్టడాలను కూల్చి వేయాలని కోరారు. కబ్జాలకు ఒడిగట్టి కట్టడాలు చేసినవారు స్వచ్ఛందంగా అక్కడి నుండి వైదొలగనిచో చట్టపరమైన చర్యలతో శిక్షలకు గురికావాల్సి ఉంటదని, కోర్టుల పరంగా కూడా వెళ్తూ న్యాయపరంగా రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చెరువు భూముల్లో నిర్మితమైన అన్ని కట్టడాలను సమూలంగా కూల్చి వేస్తామని హెచ్చరించారు.

ALSO READ : 

GreenTea : గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్ని లాభాలా.. అవేంటో తెలుసుకుందాం..!

Suryapet : బాలెంల గురుకుల కళాశాలలో ప్రిన్సిపల్ గదిలో బీరు బాటిల్స్.. సంఘటనపై త్రి సభ్య కమిటీ..! 

Hair Growth : జుట్టు పెరుగుదల, బట్టతల రాకుండా ఏం చేయాలి.. నేచురల్ గా పెరుగుతుంది..!