అక్రమ నిర్మాణాలను కూల్చివేత..!

హత్నూర మండలం ఎల్లమ్మ గూడా శివారులు గల సర్వేనెంబర్ 509/35 ప్రభుత్వం గతంలో ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ఉపాధి కోసం అసైన్డ్ భూమిని కేటాయించింది.

అక్రమ నిర్మాణాలను కూల్చివేత..!

అసైన్డ్ భూములు అమ్మిన, కొన్నా చర్యలు తప్పవు

తహసిల్దార్ సంధ్యారాణి

హత్నూర, మన సాక్షి:

హత్నూర మండలం ఎల్లమ్మ గూడా శివారులు గల సర్వేనెంబర్ 509/35 ప్రభుత్వం గతంలో ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ఉపాధి కోసం అసైన్డ్ భూమిని కేటాయించింది. అప్పటినుండి ఆ భూమి స్వాధీనంలో ఉన్నవారు తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అట్టి ని భూమిని ప్లాట్లుగా చేసి గుంటల గుంటలు గుంటలుగా చేపట్టి విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం కొనుగోలు చేసిన వ్యక్తులు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ప్రహరీ గోడలు, ఇండ్ల నిర్మాణాలు చేశారు. కాగా ఓ వ్యక్తి ఆ ప్రభుత్వ అసైన్డ్ భూమిని కొంత కొనుగోలు చేసి కబ్జాలోకి వెళ్లడానికి చూస్తే అదే భూమి అమ్మిన వ్యక్తులు అడ్డు తగలడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

ALSO READ : Telangana : తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. నిబంధనలు ఇవేనా..!

జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, పంచాయతీ శాఖ, ఆధ్వర్యంలో విచారణ చేపట్టి స్థానిక తహసిల్దార్ సంధ్యారాణి బృందం ఆర్ ఐ శ్రీనివాస్ , గ్రామ కార్యదర్శి అలేఖ్య అట్టి భూమి ప్రభుత్వ భూమిని గుర్తించి పూర్తిస్థాయిలో విచారణ చేసి ఒక రోజు ముందు నోటీసులు జారీ చేసి శనివారం అక్రమ నిర్మాణాలు తొలగించారు. ఇక నుంచి ఎవరైనా అసైన్డ్ భూములు కొన్న, అమ్మిన చర్యలు తప్పవని తహసిల్దార్ సంధ్యారాణి హెచ్చరించారు.

ALSO READ : Nalgonda : మెడికల్ షాపులలో మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు.. సిగరెట్ పెట్టెలలో పెట్టి అధిక ధరలకు విక్రయం..!