Telangana : హైదరాబాద్ లో జగన్ లోటస్ పాండ్ నివాసం వద్ద నిర్మాణాల కూల్చివేత.. రేవంత్ రెడ్డికి తెలియదా..?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధికారం కోల్పోయిన వెంటనే హైదరాబాదులో ఆ ఎఫెక్ట్ కనిపించిందని చెప్పవచ్చును.

Telangana : హైదరాబాద్ లో జగన్ లోటస్ పాండ్ నివాసం వద్ద నిర్మాణాల కూల్చివేత.. రేవంత్ రెడ్డికి తెలియదా..?

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధికారం కోల్పోయిన వెంటనే జగన్ కు హైదరాబాదులో ఆ ఎఫెక్ట్ కనిపించిందని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమయంలో లోటస్పాండ్ జోలికి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. అక్కడ అధికారం కోల్పోయిన వెంటనే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ నివాసం వద్ద నిర్మాణాలను తొలగించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బంజారాహిల్స్ లోటస్ పాండ్ భవనం వద్ద ఉన్న నిర్మాణాలను రోడ్డును ఆక్రమించుకొని ఉన్నాయని, అనుమతి లేదనే ఆరోపణ, భద్రత సిబ్బంది కోసం ఏర్పాటుచేసిన అవుట్ పోస్టు, కొంత ప్రహరీ గోడను తొలగించారు. కాగా ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లిందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సమయంలో లోటస్పాండ్ కార్యాలయంగా జగన్ కార్యకలాపాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆయన సీఎం అయ్యాక అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు.

ఇటీవల వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన ఆయన సోదరి వైయస్ షర్మిల లోటస్ పాండ్ లో కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లోటస్పాండ్ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులు ఉంటున్నారు. కాగా ఆ ఇంటి అనుమతులు లేవని, రోడ్డు ఆక్రమించారని, జిహెచ్ఎంసి అధికారులు తొలగించారు.

ఈ తొలగింపు వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆక్రమణలను తొలగించాలంటూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదని, నిర్మాణాల తొలగింపులు మౌఖిక ఆదేశాలు మాత్రమే వచ్చాయని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదని.. అందుకోసమే వెంటనే జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్ ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఓ మంత్రి మౌఖిక ఆదేశాల మేరకు లోటస్ పాండ్ వద్ద నిర్మాణాలను కూల్చివేసినట్లు జిహెచ్ఎంసి అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే లోటస్పాండ్ ఆక్రమణలను తొలగించి 24 గంటలు గడవకముందే కమిషనర్ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆ కమిషనర్ కు పోస్టింగ్ కూడా ఇవ్వలేదని సమాచారం.

ALSO READ : 

గడ్డిమందు తాగితే రూ.లక్ష పందెం.. ఒప్పుకుని మందు సేవించిన వ్యక్తి..!

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!