Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District Collector : విద్యుత్ సబ్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. అధికారులకు కీలక ఆదేశాలు..!

District Collector : విద్యుత్ సబ్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. అధికారులకు కీలక ఆదేశాలు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా లో రానున్న వేసవిలో డిమాండ్ కు అణుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ విద్యుత్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నారాయణపేట విద్యుత్ శాఖ ఎస్.ఈ. కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఓవర్ లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా కు చర్యలు చేపట్టాలని కలెక్టర్ విద్యుత్ అధికారులకు సూచించారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడినా వెంటనే 1912 కు టోల్ ఫ్రీ నెంబర్ కు విద్యుత్ వినియోగదారులు ఫోన్ చేసే విధంగా ప్రజలకు ఈ నెంబర్ తెలిసే విధంగా ప్రచారం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో విద్యుత్ ఎంత వినియోగం ఉంది, దానికి తగ్గట్లు శాఖ పరంగా తీసుకుంటున్న చర్యల పై వివరాలను స్థానిక ఎస్.ఈ. సంజీవరెడ్డి కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో ఆపరేషన్ డిఈ. డి.ఎల్. నర్సింహా రావు, డిఈ. శ్రీనివాస్ , డిఈటి. జీతేందర్, ఏడి శ్రీనివాస్, ఏఈ లు పాల్గొన్నారు.

MOST READ :

  1. Hyderabad : క్షుద్ర పూజలు చేస్తున్నాడనే ఆరోపణలతో హత్య.. కేసును ఛేదించిన పోలీసులు..!

  2. Additional Collector : ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!

  5. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!

మరిన్ని వార్తలు