Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఓటరు జాబితాలో పేరు ఉండాలంటే ఇలా చేయాల్సిందే..! 

గత ఎన్నికల్లో మేము ఓటు వేశాం.. మా ఓటు ఓటరు జాబితాలో ఉంది అని ధీమాతో ఎవ్వరూ ఉండవద్దని, తప్పకుండా ఎన్యూమరేషన్ పత్రం పూరించి ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేరు తొలగించబడుతుందని జిల్లా కలెక్టర్ ప్రియాంక హెచ్చరించారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఓటరు జాబితాలో పేరు ఉండాలంటే ఇలా చేయాల్సిందే..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

గత ఎన్నికల్లో మేము ఓటు వేశాం.. మా ఓటు ఓటరు జాబితాలో ఉంది అని ధీమాతో ఎవ్వరూ ఉండవద్దని, తప్పకుండా ఎన్యూమరేషన్ పత్రం పూరించి ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేరు తొలగించబడుతుందని జిల్లా కలెక్టర్ ప్రియాంక హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ 130,131 పోలింగ్ కేంద్రాలు, బాపునగర్ 122,156 పోలింగ్ కేంద్రాల పరిధిలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ పత్రాల పూరించే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పట్టణంలో ఎన్యూమరేషన్ పత్రాలు పూరించే ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందని, బి ఎల్ వో లు పత్రాలు పూరించడంలో ఓటర్లకు సహకరించాలని ఆమె సూచించారు. ఎస్ ఐ ఆర్ అంటే కొత్తగా ఓటరు జాబితా తయారీ అని, ఇంతకు ముందు ఉన్న జాబితా పూర్తిగా రద్దు అయి కొత్త జాబితా వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శంకర్, వార్డు కౌన్సిలర్లు కందేన్ పల్లి సత్యమ్మ, రాఘవేంద్ర, వార్డు ఆఫీసర్లు, బీఎల్ వో లు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు