Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రైస్ మిల్లులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

Miryalaguda : రైస్ మిల్లులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వానాకాలం వరి కోతలు నిర్వహిస్తున్నందున రైతులు సన్నధాన్యమును ఎక్కువగా రైస్ మిల్లులో విక్రయిస్తున్నారు.

దాంతో రైతులకు రైస్ మిల్లుల్లో మద్దతు ధర లభిస్తుందా..? లేదా..? అనే విషయంపై జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి లో ఉన్న వైష్ణవి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైస్ మిల్లులో ధాన్యం విక్రయించుకున్న రైతులకు మద్దతు ధర చెల్లించాలని మిల్లర్లను ఆదేశించారు.

ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు